Anganwadi Jobs : 10వ తరగతి అర్హతతో.. ఏపీలో అంగన్‌వాడీ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
జిల్లా వ్యాప్తంగా 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అంగన్‌వాడీ వర్కర్/ మినీ అంగన్‌వాడీ వర్కర్/ అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి.
అర్హతలు ఇవే..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
జీతం :
అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000 జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ 24, 2022
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/
అంగన్‌వాడీ పోస్టుల పూర్తి వివరాలు ఇవే..