Skip to main content

Job Opportunities 2023 : 3036 గ్రూప్ బీ, సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశవ్యాప్తంగా ఉన్న‌ ఎయిమ్స్‌ల‌లో 3036 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఉద్యోగాలను కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ ఎయిమ్స్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.
AIIMS Recruitment, Golden Opportunity for 3036 Positions, Common Recruitment Exam for AIIMS Jobs, Common Recruitment Examination Notification, 3036 AIIMS Jobs: Apply Now, AIIMS Jobs Applications 2023 , AIIMS Recruitment 2023: 3036 Job Opportunities,

దేశంలో ఉన్న వివిధ ఎయిమ్స్‌ సంస్థల్లో గ్రూప్‌-బీ, సీ పోస్టుల భర్తీకి ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివ‌రాలు ఇవే : 
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైటీషియన్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, ఆడియోలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్, బయో మెడికల్ ఇంజినీర్, క్యాషియర్, కోడింగ్ క్లర్క్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డెంటల్ హైజీనిస్ట్, డైటీషియన్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఫైర్ టెక్నీషియన్, గ్యాస్/ పంప్ మెకానిక్, హెల్త్ ఎడ్యుకేటర్, హిందీ ఆఫీసర్, హాస్పిటల్ అటెండెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ఫిజియోథెరపిస్ట్, జూనియర్ రిసెప్షన్ ఆఫీసర్, జూనియర్ వార్డెన్, ల్యాబ్ టెక్నీషియన్, లాండ్రీ మేనేజర్, లాండ్రీ సూపర్‌వైజర్, లీగల్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవే :
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ : డిసెంబర్‌ 1, 2023
దరఖాస్తు సవరణ తేదీలు : 06.12.2023 నుంచి 07.12.2023 వరకు
అడ్మిట్ కార్డుల జారీ తేదీ : డిసెంబర్‌ 12, 2023
పరీక్ష తేదీలు : డిసెంబర్‌ 18 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తారు.

అర్హత ఇవే..: 
పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్/ పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి/ ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, టైపింగ్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు ఇలా : 
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3000.. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400.. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ ఇలా :
సీబీటీ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు :  https://aiimsexams.ac.in/info/Recruitments_new.html

Published date : 20 Nov 2023 03:16PM

Photo Stories