Skip to main content

Lockdown: చైనాలో లాక్‌డౌన్‌.. ఆందోళనలో ప్ర‌పంచ దేశాలు..!

బీజింగ్‌: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న సంతోషంతో ఉన్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది.
Covid
Lockdown in China

తాజాగా చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌ కారణంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 2020 మార్చి తర్వాత రోజువారీ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం చైనాలో కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వివిధ నగరాల్లో వేయికి పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్‌డౌన్‌ విధించారు.

1 కోటి 75 లక్షల మంది జనాభా ఉండటంతో..
మరోవైపు.. దక్షిణ చైనాలోని టెక్ హబ్‌గా పిలువబడే షెన్‌జెన్‌లో ఒకే రోజు 66 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు తెలిపారు. షెన్‌జెన్‌లో 1 కోటి 75 లక్షల మంది జనాభా ఉండటంతో అధికారుల్లో టెన్షన్‌ నెలకొంది. దీంతో వారిని ఇళ్లకే పరిమితం చేస్తూ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు కూడా నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. కాగా హువావే, టెన్‌ సెంట్‌ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్‌జెన్‌లోనే ఉన్నాయి. షెన్‌జెన్‌ నగరం హంకాంగ్‌తో సరిహద్దును కలిగి ఉంది.

Omicron: మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ ఎన్ని గంటలు బతికుంటుందో ఉంటుందో తెలుసా..?

19 రాష్ట్రాల్లో :

19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌ చున్‌లో శుక్రవారం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. షాన్‌ డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో కూడా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజింగ్‌లో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశాన్నినిషేధించారు. దీంతో చైనా ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది.

Covid Effect: ఊహకందని విషయం ఇది.. 7 నెలల కన్నా ఎక్కువ కాలం మనిషి శరీరంలో...?

ఊపిరి పీల్చుకుంటున్న స‌మ‌యంలోనే..
చైనాలో కొత్త వైరస్‌, వేరియెంట్‌ వార్త‌లతో ఆందోళ‌న‌కు గురయ్యాయి. అయితే చైనాలో విజృంభిచేది ఒమిక్రాన్‌ వేరియెంట్‌ అని, ప్రమాదకరమైంది కాదని సైంటిస్టులు ఊరట ఇస్తున్నారు. భారత్‌లో మరో వేవ్‌ కష్టమేనని, అయినా అప్రమత్తంగా ఉండడం మంచిదన్న సంకేతాలు ఇటీవలె వైద్య నిపుణులు ఇచ్చిన సంగతీ తెలిసిందే. 

Good News : ఏడాది చివరికి కరోనా అంతం..! డబ‍్ల్యూహెచ్ఓ కీల‌క ప్రకటన..

నివ్వెరపోయిందిలా..
గ్వాంగ్‌ డాంగ్, జిలిన్, షాన్‌ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వింటర్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో కట్టడి ద్వారా కేసుల్ని నియంత్రించుకోగలిగింది చైనా. అయితే జీరో కోవిడ్‌ టోలరెన్స్‌ పేరిట దారుణంగా వ్యవహరించిన దాఖలాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. వింటర్‌ ఒలింపిక్స్‌ ఈవెంట్స్‌ ముగిశాక జనసంచారం పెరిగిపోవడంతో ఇప్పుడు కేసులు మళ్లీ పెరుగుతున్నాయి అంతే. మరోవైపు హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయట‌. దీంతో ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితికి త‌గ్గ‌ట్లుగా అధికారులు ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. ఇది అసలు సంగతి.

New Virus in China:మళ్లీ కొత్త వైరస్‌? ..అసలు సంగతి ఇదే.. ఊపిరి పీల్చుకుంటున్న స‌మ‌యంలోనే..

 

Published date : 14 Mar 2022 04:44PM

Photo Stories