Skip to main content

Holidays October 2023 List : ఉద్యోగులకు..విద్యార్థుల‌కు..ఇక పండ‌గే..పండ‌గ‌.. అక్టోబర్‌లో భారీగా సెలవులు.. హాలిడేస్ ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సంవ‌త్స‌రం అంతా పండ‌గ ఒక అక్టోబ‌ర్ నెల‌లోనే క‌న్పిస్తుంది. ఇటు స్కూల్‌, కాలేజీ విద్యార్థుల‌కు.. అటు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగుల‌కు ఈ అక్టోబ‌ర్ నెల‌లోనే ఎక్కువ సెల‌వులు రానున్నాయి.
Holidays October 2023 News Telugu,Festive Month of OctoberSchool and College holidays,
Holidays October 2023 Telugu News

రానున్న అక్టోబర్ నెలలో బ్యాంకులకు, స్కూల్స్‌, కాలేజీల‌కు, వివిధ  ర‌కాల సంస్థ‌ల‌కు అత్యధికంగా సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే స్కూల్స్‌కు దాదాపు 15రోజులు వ‌ర‌కు సెల‌వులు ఉన్నాయి. అక్టోబర్‌ సెలవుల జాబితాలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు వంటి సాధారణ సెలవులు 7 ఉన్నాయి.

☛ Schools & Colleges Holidays October 2023 List : అక్టోబ‌ర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు అత్యంత భారీగా సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

RBI క్యాలెండర్ ప్రకారం..

rbi bank holidays 2023

మరోవైపు RBI క్యాలెండర్ ప్రకారం.. పండుగ లేదా గెజిట్ హాలిడేస్‌ 11 ఉన్నాయి. వీటిలో కొన్ని బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. మరికొన్ని రాష్ట్రానికి రాష్ట్రానికి, బ్యాంకుకు బ్యాంకుకు భిన్నంగా ఉండవచ్చు. అక్టోబర్‌ నెల ప్రారంభంలోనే మొదటి రెండు రోజులు వరుసుగా సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం కాగా అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 24న దసరా కారణంగా హైదరాబాద్, ఇంఫాల్ మినహా చాలా బ్యాంకులు మూతపడనున్నాయి.

☛ Schools & Colleges Dussehra Holidays 2023 : తెలంగాణ‌, ఏపీలో భారీగా దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

అక్టోబర్ నెల‌లో సెలవుల పూర్తి వివ‌రాలు ఇవే..
☛ అక్టోబర్ 1: ఆదివారం
☛ అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి
☛ అక్టోబర్ 8: ఆదివారం
☛ అక్టోబర్ 14: రెండవ శనివారం
☛ అక్టోబర్ 14: మహాలయ (కోల్‌కతా)
☛ అక్టోబర్ 15: ఆదివారం
☛ అక్టోబర్ 18: కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా)
☛ అక్టోబర్ 21: దుర్గాపూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్క్‌జాతా)
☛ అక్టోబర్ 22: ఆదివారం
☛ అక్టోబర్ 23: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయ దశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం).
☛ అక్టోబర్ 24: దసరా/దుర్గాపూజ (హైదరాబాద్ మరియు ఇంఫాల్ మినహా... భారతదేశం అంతటా)
☛ అక్టోబర్ 25: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
☛ అక్టోబర్ 26: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్)
☛ అక్టోబర్ 27: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
☛ అక్టోబర్ 28: లక్ష్మీ పూజ (కోల్‌కతా)
☛ అక్టోబర్ 28: నాల్గవ శనివారం
☛ అక్టోబర్ 29: ఆదివారం
☛ అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్)

ఈ అక్టోబ‌ర్ నెల సెల‌వుల నామ‌సంవ‌త్స‌రంలా ఉంది. ఉద్యోగులకు.., విద్యార్థుల‌కు.. ఇక పండ‌గే.. పండ‌గ‌.

Published date : 29 Sep 2023 09:19AM

Photo Stories