సస్పెండ్, డిస్మిస్‌కు మధ్య తేడాలేంటో మీకు తెలుసా!
Sakshi Education
తప్పు చేసిన చాలా శాతం ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అవుతారు. చాలా తక్కువ మంది డిస్మిస్ అవుతారు. అయితే వీటిలో తేడాలేంటో తెలుసుకుందాం.
సస్పెండ్ ఎప్పుడు చేస్తారు
ఉద్యోగ వృత్తిలో తప్పు చేసిన ఉద్యోగిని సస్పెండ్ చేస్తారు (లంచం తీసుకున్నా.. వృత్తిలో తప్పు చేసినా..) ఇది ఒక రకమైన శిక్ష, సీనియర్ అధికారులకి తప్పు చేసిన కింది ఉద్యోగిని కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్ పరిమితి పూర్తయిన తర్వాత అదే ఉద్యోగం తిరిగి పొందుతాడు. కానీ ఆ వ్యక్తి సస్పెండ్‌గా ఉన్నంత కాలం జీతం, డీఏలో సగం మాత్రమే పొందుతాడు. తిరిగి నియమించబడిన తర్వాత పూర్తి జీతం పొందుతాడు.
డిస్మిస్ ఎప్పుడు చేస్తారు
తప్పు చేసి విచారణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి దోషిగా తేలితే అతన్ని తొలగిస్తారు. సస్పెన్షన్‌లో ఉద్యోగి తన పోస్ట్ లేదా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ డిస్మిస్‌లో అది జరగదు. అలాగే ఒక ఉద్యోగిని తొలగించినప్పుడు వారికి జీతం లేదా భత్యం లభించదు. అంతేకాదు ఆ ఉద్యోగి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హుడు కాదు.
చదవండి:
Published date : 13 Nov 2021 05:23PM