Skip to main content

Success Story: విద్యార్థుల‌కు భోద‌న అందిస్తున్న యూనివ‌ర్సిటీ ర్యాంకర్

చిన్న వ‌య‌స్సులోనే యూనివ‌ర్సిటీలో ర్యాంకు సాధించి, విద్యార్థుల‌కు త‌న‌కు తోచిన విధంగా విద్యా సాయాన్ని అందిస్తోంది ఓ విద్యార్థిణి. ఆమె గురించి తెలుసుకుందాం..
university ranker achieved teaching job for students, Empowering Students
university ranker achieved teaching job for students

సాక్షి ఎడ్యుకేష‌న్: క్రమశిక్షణ, కఠోర విద్యాభ్యాసం ఎం.విష్ణుప్రియను ఆర్ట్స్‌ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకురాలిగా ఎదిగేలా చేసింది. తన 24వ ఏటనే డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా ఉద్యోగం సాధించిన ఆమె ఎమ్మెస్సీలో ఆంధ్ర యూనివర్సిటీలో మొదటి ర్యాంకు సాధించారు. వృక్షశాస్త్ర విభాగంలో తనదైన శైలిలో బోధన కొనసాగిస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాల వృద్ధికి బాటలు వేస్తున్నారు. తరగతి గదిలో సెమినార్‌, ప్రాజెక్ట్‌ పద్ధతుల్లో విద్యాబోధన సాగించడంలో ఆమె నిష్ణాతురాలు.

TS Teacher Jobs 2023 : టీచ‌ర్ ఉద్యోగాలు.. ప్రభుత్వం చెప్పింది 13 వేలు.. విద్యాశాఖ తేల్చింది 22 వేలు.. ఏది నిజం..?

వివిధ రకాల ఔషధ మొక్కల వివరాలు సేకరిస్తూ విద్యార్థులను చైతన్య పరుస్తూ అందులో పీహెచ్‌డీ పొందేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసరుగా సేవలందిస్తూ విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలనూ బోధిస్తున్నారు. తనవంతు సేవల్లో భాగంగా ఏటా ఓ నిరుపేద విద్యార్థి చదువులకయ్యే మొత్తం ఖర్చును ఆమెనే భరిస్తున్నారు.
 

Published date : 04 Sep 2023 11:57AM

Photo Stories