Training for Teachers: ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుల ఐదు రోజుల శిక్షణ
Sakshi Education
అధ్యాపకులకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ఐదు రోజుల శిక్షణ గురించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దివాకర్‌రరెడ్డి తెలిపారు. కార్యక్రమం అనంతరం వారు ఎన్‌ఆర్సీ కోఆర్డినేటర్ ను అభినందించారు..

అనంతపురం: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఐదు రోజుల పాటు జరిగిన అధ్యాపకుల శిక్షణ శుక్రవారం ముగిసింది. అనంతపురం, గుంతకల్లు ఎన్‌ఆర్సీ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి జంతు, జీవ సాంకేతిక శాస్త్ర, జీవ రసాయన శాస్త్ర అధ్యాపకులు శిక్షణకు హాజరయ్యారు. ఆధునిక బోధనా అంశాలపై హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, స్థానిక కీ రిసోర్స్ పర్సన్లు డాక్టర్ జయప్ప, డాక్టర్ రాజశేఖర్ అవగాహన కల్పించారు.
Free Admissions: పేద విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్న విద్యా చట్టం..
ఆన్‌లైన్ ద్వారా కళాశాల విద్య కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్, ఓఎస్డీ డాక్టర్ అనిల్‌కుమార్ పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. శిక్షణ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దివాకర్‌రెడ్డి, ఎన్‌ఆర్సీ కోఆర్డినేటర్ లక్ష్మీకాంతంను అభినందించారు.
Published date : 16 Mar 2024 11:24AM