Skip to main content

Sports Competitions: వ‌సంత ట్రిపుల్ జంప్ లో విద్యార్థులకు ర‌జ‌త ప‌త‌కం

విద్యార్థుల జిల్లా స్థాయి పోటీల్లో సాధించిన ప్ర‌తిభను గురించి ఆ క‌ళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొని విజ‌యం పొందిన వారికి ఈ పుర‌స్కారాన్ని అందించారు.
College principal awarding students
College principal awarding students

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రస్థాయి ఆటల పోటీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపల్‌ జలగం అనిత శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి ఉమెన్స్‌ లీగ్‌ అథ్లెంటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో కళాశాలకు చెందిన విద్యార్థినులు వసంత ట్రిపుల్‌ జంప్‌ విభాగంలో రజత పతకాన్ని సాధించినట్లు తెలిపారు.

Degree : ఇక‌పై డిగ్రీలో నూత‌న విధానం.. ఇంజినీరింగ్‌తో సమానంగా..

అదేవిధంగా డిస్క్‌త్రోలో జ్యోతి, శ్రీజ, లాంగ్‌ జంప్‌లో అంజలి పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లెక్చరర్లు కోటయ్య, గణపతి, ప్రభాత్‌రావు, చంద్రకాంత్‌, నరేష్‌ పాల్గొన్నారు.
 

Published date : 23 Sep 2023 11:56AM

Photo Stories