Skip to main content

Alumni in Agriculture College : వ్య‌వ‌సాయ క‌ళాశాల‌లో పూర్వ విద్యార్థుల సంబ‌రాలు..

Agriculture college alumni celebrates their gathering after 40 years

బాపట్ల: బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో 1974 బ్యాచ్‌ విద్యార్థులు ఆదివారం సంబరాలు నిర్వహించారు. దాదాపు 60 మంది పూర్వవిద్యార్థులు హాజరై ఆనాటి మధురస్మృతులను గుర్తుచేసుకున్నారు. విలువైన అనుభవాలను పంచుకున్నారు. దీనికి సహకరించిన కళాశాల డీన్‌ డాక్టరు ప్రసూనరాణిని అభినందించారు. కళాశాల విద్యార్థులకు అవసరమైన తరగతి గదుల నిర్మాణానికి సహకారం అందిస్తామని తెలిపారు.

Navodaya Admissions : న‌వోదయ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ఈ విద్యార్థుల ప్ర‌భంజ‌నం..!

ఆ మేరకు మయూరవల్లి ఏసీ కొనేందుకు నగదు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఒంగోలులోని విద్యోన్నతి ఫౌండేషన్‌ నుంచి సాయం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థులైన ప్రభుత్వ రిటైర్డు చీఫ్‌ సెక్రటరీ అజేయ కల్లాం, రిటైర్డు ఆటవీశాఖ అధికారి ఎం.సుధాకర్‌, జి.వి.నాగేశ్వరరావు, అశోక్‌రాణి, చక్రపాణి, కాశీ విశ్వంత్‌, సన్యాసిరావు, ఏవీ రంగారెడ్డి, డి.వీరనారాయణ, జయంతి వెంకటేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

INSPIRE Manak Awards : ఇన్‌స్పైర్‌ అవార్డులకు దరఖాస్తుకు గడువు పెంపు

Published date : 16 Sep 2024 03:51PM

Photo Stories