Skip to main content

Spot Admissions Date: క‌ళాశాల‌ల్లో పాలిటెక్నిక్ కోసం స్పాట్ అడ్మిష‌న్లు

స్పాట్ అడ్మిష‌న్లు పొందేందుకు విద్యార్థులు ప్ర‌క‌టించిన తేదీకి క‌ళాశాల‌ల్లో హాజ‌రు కావాల్సి ఉంటుంది అని ప్రిన్సిపాల్ ప్ర‌క‌టించారు. అడ్మిష‌న్ల‌క తేదీ, అర్హులు, త‌దిత‌ర వివ‌రాల‌ను కూడా స్ప‌షించారు. వీటి పూర్తి వివ‌రాల‌ను ప‌రిశీలించండి..
Spot admissions at Rebeca college
Spot admissions at Rebeca college

సాక్షి ఎడ్యుకేష‌న్: మండలంలోని రేబాక పాలిటెక్నిక్‌ కళాశాలలో వచ్చే నెల 3న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ ఐ.వి.ఎస్‌.ఎస్‌.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిటెక్నిక్‌లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆరోజు ఉదయం 10 గంటలకు విద్యార్థులు హాజరు కావాలన్నారు. పాలిసెట్‌–2023 రాసి సీటు రానివారు, సీటు వచ్చి కళాశాలలో చేరని వారు, పదో తరగతి పాసై, పాలిసెట్‌ రాయని వారు దరఖాస్తులను కళాశాలలో సమర్పించాలని సూచించారు.

Development of Gurukul Schools: గురుకుల విద్యార్థుల‌కు మౌలిక సౌకర్యాలు

స్పాట్‌ అడ్మిషన్‌కు వచ్చే విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. సీటు పొందిన వారు మొత్తం ఫీజును తక్షణమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి ఉపకారవేతనం రాదని, మూడేళ్ల పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నా రు. ఇతర కళాశాలలో ఇదివరకే ప్రవేశం పొందిన విద్యార్థులకు స్పాట్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదన్నారు. వివరాలకు 9441346598 సంప్రదించాలని సూచించారు.

Published date : 30 Sep 2023 12:06PM

Photo Stories