ఏయూ క్యాంపస్: ఆంధ్ర యూనివర్సిటీని తీర్చిదిద్దుతున్న విధంపై పూర్వ విద్యార్థుల హర్షం
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సాంకేతికంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న విధానంపై పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఏయూ రసాయన శాస్త్ర విభాగంలో చదువుకున్న 1984–86 బ్యాచ్ పీజీ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఈ బ్యాచ్ విద్యార్థులు విభాగాన్ని సందర్శించి, అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డితో సమావేశమయ్యారు.
Kota Coaching Centers: రెండు నెలల పాటు పరీక్షలు బంద్... విద్యార్థులకు కౌన్సెలింగ్..!
ఈ సందర్భంగా ఏయూ క్యాంపస్‌లో జరుగుతున్న నూతన ప్రాజెక్టులు, కార్యక్రమాలను తాము ఎప్పటికప్పుడు ప్రసారమాధ్యమాలు, స్నేహితుల నుంచి తెలుసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తుకు అవసరమైన నూతన సాంకేతికతలను చేరువ చేసి నేటి తరం విద్యార్థులకు అందిస్తున్న విధానాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. స్టార్టప్, ఇంక్యుబేషన్ సెంటర్‌ను సందర్శించాలని వీసీ పూర్వ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.