Kota Coaching Centers: రెండు నెలల పాటు పరీక్షలు బంద్... విద్యార్థులకు కౌన్సెలింగ్..!
ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలలపాటు కోటాలోని శిక్షణా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి టెస్టులు నిర్వహించకూడదని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అలాగే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సెప్టెంబరు, అక్టోబరులో విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఇప్పటికే భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమర్చుతున్నారు.
ఇవీ చదవండి: గేట్‌తో ప్రయోజనాలు, కొత్త మార్పులు, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
భవనాల పై అంతస్తు నుంచి దూకినా గాయపడకుండా కింద ఆవరణల్లోనూ వలలు కడుతున్నారు. ఇవేవీ విద్యార్థుల ఆత్మహత్యలను ఆపడం లేదు. ఆదివారం మధ్యాహ్నం అవిష్కర్ శంభాజీ కస్లే (17) అనే విద్యార్థి తన హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటననుంచి తేరుకోకమునుపే సాయంత్రం బిహార్‌కు చెందిన ఆదర్శ్ రాజ్ (18) అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. వీరి మృతితో.. ఈ ఏడాది ఇప్పటివరకూ కోటాలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య 24కు పెరిగింది.
ఇవీ చదవండి: ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్ సీట్లు