Skip to main content

Polytechnic College Admissions: పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశ దరఖాస్తులకు తేదీ పొడగింపు.. ఇదే చివరి తేదీ..

విద్యార్థులు పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తుల తేదీ ఈనెల 5 అని ప్రకటించినగా తేదీని మరికొద్ది రోజులకు పొడగించినట్లు తెలిపారు కళాశాల ప్రిన్సిపాల్‌..
Polytechnic College admission application extension announcement  Registrations for admissions at polytechnic college gets extended  Principal of Nandyala Polytechnic College

 

నంద్యాల: పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులను ఈనెల 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నంద్యాల పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ శ్రీనివాసప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. ఈనెల 5వ తేదీ వరకు ఉన్న గడువును మరో ఐదు రోజులు ప్రభుత్వం పొడిగించిందన్నారు. పదవ తరగతి విద్యార్హతతో పాలిటెక్నిక్‌ అభ్యసించేందుకు అవకాశం ఉందన్నారు.

Archery Competitions: జిల్లా స్థాయిలో ఆర్చరీ పోటీలు..

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఉచిత కోచింగ్‌, స్టడీ మెటీరియల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇవ్వనున్నారని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ బోధించడం జరుగుతుందన్నారు. శిక్షణ తీసుకొనే వారికి స్టడీ మెటీరియల్‌ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈనెల 27వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

Tenth Class Students : పదో ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు రాశారా..? అయితే మీరు ఈ కాలేజీల వాళ్ల‌తో అల‌ర్ట్‌గా ఉండాల్సిందే..!

Published date : 08 Apr 2024 12:19PM

Photo Stories