Tenth Class Students: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాశారా..? అయితే మీరు ఈ కాలేజీల వాళ్లతో అలర్ట్‌గా ఉండాల్సిందే..!
అలాగే ఫీజులు కూడా భారీగా పెరుగుతాయి.. మీ ఇష్టం.. ఆలోచించుకొండి..’ ఇది పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు రోజూ వస్తున్న ఫోన్‌కాల్స్. ఇలా ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్‌వోలను నియమించుకొని ప్రవేశాల కోసం గాలం వేస్తున్నాయి.
కూలీ నాలి చేసైనా..
మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కూలీ నాలి చేసైనా మంచి కళాశాలలో చదివించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. అందించేది అరకొర విద్యే అయినప్పటికీ.. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి.. రంగురంగుల బ్రౌచర్లు చూపి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరి మాయమాటలు నమ్మి చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులు సైతం అమ్ముకొని పిల్లలను చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫలితాలు రాక ముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా అడ్మిషన్ల వేట ప్రారంభించాయి.
కాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా..
ఆయా కళాశాలలు నియమించుకున్న పీఆర్వోలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈ తతంగం మొదలైంది. వీరు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా ఇప్పటికే సేకరించారు. వివరాలు ఇచ్చినందుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధన ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికీ ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన పలు కళాశాలల వారు జిల్లాలో 50 మంది వరకు పీఆర్‌వోలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, వారి కళాశాలల్లో ఇచ్చే బోధన, వసతులు, ఏసీ క్యాంపస్‌లు, తదితర విషయాలను వివరిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ డబ్బంతా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచే..
కొన్ని యాజమాన్యాలు పీఆర్వోలను ప్రత్యేకంగా నియమించుకొని ఏడాది పాటు వేతనాలు ఇస్తున్నాయి. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటీవ్‌లు సైతం అందజేస్తున్నాయి. మరోవైపు సంబంధిత కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర అధ్యాపకులు, సిబ్బంది తప్పకుండా ప్రతి ఒక్కరు 25 చొప్పున ఆ కళాశాలలో అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్లు పెట్టారు. వేసవిలో తరగతులు ఉండకపోవడంతో వారికి సగం వేతనమే చెల్లిస్తున్నారు.
చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!
కాలేజీలో ప్రవేశాలు చేసిన వారికి మాత్రం ఇన్సెంటీవ్, కొంత కమీషన్ ఇస్తున్నారు. లెక్చరర్లు, ఇతరులు ఎవరైనా అడ్మిషన్లు చేస్తే సాధారణ కళాశాలకు రూ.వెయ్యి, కార్పొరేట్ కళాశాలకు రూ.5 వేల వరకు, హాస్టల్ క్యాంపస్ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే రూ.2500 అందజేస్తున్నా రు. కాగా, ఈ డబ్బంతా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నది కావడం గమనార్హం.
పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్‌లో అడ్మిషన్లు ప్రారంభించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
భారీగా ఫీజులు వసూలు ఇలా..
ఐఐటీ, నీట్, ఏసీ సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో ఏడాదికి రూ.3 లక్షలు, సాధారణ చదువుకు రూ.1 లక్ష 50వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ కళాశాలలు సైతం రూ.లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.. : రవీంద్రకుమార్, డీఐఈవో
ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన లెక్చరర్ల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను సర్కారు కళాశాలల్లో చేర్పించాలి. అడ్మిషన్‌తో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందిస్తున్నాం. స్కాలర్‌షిప్ కూడా పొందవచ్చు.
Tags
- Inter Colleges Fee Details in Telugu
- Telangana Inter Colleges Fee Details
- inter college fees in hyderabad
- corporate inter college fees details
- corporate junior colleges fees structure
- inter colleges admission 2024
- intermediate fee structure in telangana
- ts intermediate colleges heavy fee
- ts intermediate colleges heavy fee details in telugu
- corporate junior colleges have fee collection from students
- corporate junior colleges have fee collection from students news telugu
- ts junior colleges collection over fee
- ts junior colleges collection over fee details in telugu
- ts junior college admission 2024
- TS Inter 1st Year
- ts inter first year fee
- ts inter second year fee 2024
- ts inter 1st year college fee 2024
- ts inter first year admission 2025
- ts inter admissions 2024
- ts inter admissions 2024 problems
- ts inter admissions 2024 and fee
- ts inter admissions and college fee 2024