Registrations for ITI Colleges: ఐటీఐలో సీట్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లాలోని వివిధ ప్రభుత్వ/ప్రైవేటు ఐటీఐల్లో 2023–24 విద్యా సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీ కోసం ఐదో విడత ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జె.శ్రీకాంత్ తెలిపారు. అభ్యర్థులు iti.ap. gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలకు ఒక దరఖాస్తు సరిపోతుందని తెలియజేశారు. నమోదైన విద్యార్థులు తమ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకుని, అప్రూవ్ చేయించుకోవాలని తెలిపారు.
Medical College: వైద్య విద్యార్థులకు ప్రొఫెసర్ ప్రశంసలు
స్టీల్‌ప్లాంట్ ఆర్ కార్డుకు సంబంధించిన అభ్యర్థులు ప్రత్యేక కేటగిరీలో దరఖాస్తు చేసుకుని, విధిగా వెరిఫికేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలని సూచించారు. 9న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 10న జరిగే ప్రవేశాల కొరకు ప్రభుత్వ ఐటీఐ(ఓల్డ్)లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు.