Andhra Pradesh: ఐటీఐ ప్రిన్సిపల్ వి. శ్రీలక్ష్మి కీలక సూచన
సాక్షి ఎడ్యుకేషన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీకి మూడో సారి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ వి.శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21నుంచి 27వ తేదీలోపు ‘‘ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్’’ వెబ్‌సైట్‌లో కళాశాలను వెబ్ ఆప్షన్ ద్వారా ఎంపిక చేసుకోవాలని సూచించారు.
JNTU Anantapur Results 2023: బీటెక్, బీ–ఫార్మసీ ఫలితాల విడుదల
దరఖాస్తు చేసుకున్న తరువాత సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో చేరదలచిన వారికి 30వ తేదీ, ప్రైవేటు ఐటీఐల్లో చేరదలచిన వారికి 31వ తేదీ వరకు తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విద్యార్థులకు ఎటువంటి కాల్ లెటర్లు పంపించరని తెలిపారు. మరిన్ని వివరాలకు 94928 61369, 85000 21856, 94908 06942ను సంప్రదించాలని ఆమె కోరారు.