Skip to main content

Safety of Women: ట్రిపుల్‌ఐటీలో మహిళల భద్రతపై అవగాహన

భైంసా(ముధోల్‌): బాసర ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆగ‌స్టు 22న‌ మహిళా భద్రతపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవగాహన కల్పించారు.
Safety of Women
ట్రిపుల్‌ఐటీలో మహిళల భద్రతపై అవగాహన

 వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ, ఐపీఎస్‌ శికాగోయెల్‌ పాల్గొన్నారు. శికాగోయెల్‌ ఉమెన్‌ సేఫ్టీవింగ్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరించారు. ఏ సమస్య ఎదురైనా విద్యార్థినులు హెల్ప్‌లైన్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేసిందని ఆకతాయిల ఆటకట్టించేందుకు షీ టీం పోలీసులతో మఫ్టీలో నిఘాపెట్టామన్నారు. అసోసియేట్‌ డీన్‌లు సృజన, డాక్టర్‌ పావని, పీఆర్‌వో డాక్టర్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

చదవండి:

IIIT Collaborative with University of Tokyo: టోక్యో విశ్వవిద్యాలయంతో ట్రిపుల్‌ఐటీ సహకార అధ్యయనం

Campus Interviews: ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు

RGUKT Basara: ‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్‌

Published date : 23 Aug 2023 01:48PM

Photo Stories