New Scholarships: కొత్త స్కాలర్‌షిప్.. కొత్త విమానాశ్రయం
భువనేశ్వర్: నగరంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం శనివారం జరిగింది. దీనిలో భాగంగా వివిధ శాఖలకు చెందిన 17 ప్రతిపాదనలపై చర్చించి మంత్రి మండలి అన్నింటినీ ఆమోదించింది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ, పాఠశాల, సామూహిక విద్యాశాఖ మంత్రి సుదామ్ మరాండి, ఉన్నత విద్య, సహకార శాఖ మంత్రి అతున్ సవ్యసాచి నాయక్, అభివృద్ధి కమిషనర్ కమ్ అదనపు ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్ వివరించారు.
Junior Colleges: పాఠశాలలో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు మంజూరు
రాష్ట్రంలో అన్ని వర్గాల యూజీ (అండర్ గ్రాడ్యుయేట్), పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) విద్యార్థులందరికీ కొత్తగా స్కాలర్‌షిప్ అందజేయాలని మంత్రి మండలి తీర్మానించింది. గతంలో ఈ సౌలభ్యం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని యూజీ, పీజీ విద్యార్థులకు మాత్రమే పరిమితం. మంత్రి మండలి తాజా తీర్మానం ప్రకారం ఇతర శాఖలు వ్యవసాయం, సాంస్కృతిక శాఖ అధీనంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్ సదుపాయం విస్తరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక ఉపాధ్యాయుల వేతనాలను సవరించింది.
DSC New Schedule: విడుదలైన డీఎస్‌సీ పరీక్ష కొత్త షెడ్యూల్
దీనివల్ల 1,04,000 మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.587 కోట్లు వెచ్చించనుంది. ఎలిమెంటరీ టీచర్ల కేడర్ పునర్వ్యవస్థీకరించబడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రాంతంలో విమానయానం మాత్రమే కాకుండా భద్రతను కూడా నిర్ధారించడానికి బిజూ పట్నాయక్ ఏవియేషన్ సెంటర్‌ను ఢెంకనాల్ బిరాషల్‌లో ఏర్పాటు చేస్తారు.
Civil Engineering: సివిల్ ఇంజనీరింగ్ విద్యలో ఉపాధికి ఢోకా లేదు
ఇక్కడ విమానయానానికి సంబంధించిన ప్రతి భాగస్వామ్య శాఖ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది తదితరులకు వివిధ రకాల శిక్షణలు ఇస్తారు. విమానయాన కేంద్రం కోసం రూ.562 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరోవైపు 318 సంయుక్త బస్ స్టేషన్లకు రూ.6 వేల కోట్లు మంజూరయ్యాయి.