Skip to main content

Junior Colleges: పాఠశాలలో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు మంజూరు

శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అధికారులు మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించిన అనుమతుల గురించి వివరించారు..
YSRCP Ministers speaking about the permissions for Junior Colleges

గుర్ల: మండలంలోని తెట్టంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు, వైఎస్సార్‌ సీపీ నేతలు కె.వి సూర్యనారాయణరాజు, పొట్నూరు సన్యాసినాయుడు తెలిపారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడిన వారు తెట్టంగిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటైతే ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలకు చెందిన విద్యార్థులకు ఉపయోగకరమన్నారు.

DSC New Schedule: విడుదలైన డీఎస్‌సీ పరీక్ష కొత్త షెడ్యూల్‌

కళాశాల మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లకు ధన్యావాదాలు తెలిపారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ తోట తిరుపతిరావు, పార్టీ మండల అధ్యక్షుడు జమ్ము స్వామినాయుడు, జేసీఎస్‌ కన్వీనర్లు బెల్లాన బంగారునాయుడు, కెంగువ మధుసూదనరావు పాల్గొన్నారు.

Bharat Mandapam: ప్రగతి మైదానం ఇకపై ‘భారత్‌ మండపం’

Published date : 10 Mar 2024 09:28AM

Photo Stories