AP Govt: శిక్షణ, ఉపాధి కల్పనకు రూ.5 కోట్లు మంజూరు
Sakshi Education
గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్లో (వైటీసీ) నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ కోర్సుల్లో శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందని వైటీసీ మేనేజర్ ఎస్.రాము తెలిపారు.
పార్వతీపురం ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. స్థానిక విలేకరులతో ఆయన శుక్రవారం మాట్లాడుతూ వైటీసీలో జనరల్ డ్యూటీ అసిస్టెంట్, రిటైల్ స్టోర్ మేనేజర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులను ప్రారంభించేందుకు అధికారుల నుంచి అనుమతి లభించిందన్నారు. ఆయా శిక్షణ తరగతులు త్వరలో ప్రారంభిస్తామని, శిక్షణ అనంతరం అభ్యర్థులకు సర్టిఫికెట్లు మంజూరు చేసి, ప్రైవేట్ సెక్టార్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
Published date : 09 Mar 2024 05:08PM