Collector: డ్రాపౌట్ విద్యార్థులను బడిలో చేర్పించాలి
ఏలూరు(మెట్రో): ప్రతిఒక్కరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నట్టు కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిషన్ గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్) జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు 2023–24లో డ్రాప్‌ఔట్‌ను గుర్తించే సర్వేపై మండలాల వారీగా సమీక్షించారు. 19 కేటగిరీల్లో చేపట్టిన అంశాలను సమీక్షించారు. కొన్ని మండలాల్లో సర్వే అంశాలు సంక్షిప్తంగా లేకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈనెల 22 నాటికి స్పష్టమైన సమాచారంతో నివేదికను సమర్పి ంచాలని ఆదేశించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్‌లో చేరకపోవడానికి గల కారణాలపై ప్రిన్సిపాళ్లను ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి చదువు ప్రాముఖ్యతను వివరించి కళాశాలల్లో చేరేలా చూడాలన్నారు.
చదవండి: Vice Chancellor: ఉద్యోగ, ఉపాధి లక్ష్యంగా విద్యలో మార్పులు అనివార్యం