IIITDM Kurnool: అత్యాధునిక టెక్నాలజీ కోర్సులతో ఐఐఐటీడీఎం కళాశాల
ఈ కళాశాలలో అత్యాధునిక టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐఐటీడీఎం పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టు కొండపై 151.51 ఎకరాల్లో ఈ క్యాంపస్‌ను నిర్మించారు. భారతీయ ఐటీ పరిశ్రమను బలోపేతం చేయడంలో, దేశీయ ఐటీ మార్కెట్ వృద్ధికి దోహదపడటానికి ఈ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ కీలక పాత్ర వహిస్తోందని ఐఐఐటీడీఎం డైరక్టర్ సోమయాజులు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకు కావలసిన సాంకేతికత, సాంకేతిక నిపుణులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ఇనిస్టిట్యూట్‌ని స్థాపించడం జరిగిందన్నారు. 296.12 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో 16 తరగతి గదులు, 22 ప్రయోగశాలలు, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్, 3 సెమినార్ హాళ్లు, 4 హాస్టళ్లు, 2 మెస్ బ్లాక్‌లు, డైరెక్టర్ బంగ్లా, 20 ఫ్యాకల్టీ క్వార్టర్‌లు, 2 రెండు సబ్‌స్టేషన్లు, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లతో పాటు 1260 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు క్యాంపస్ అభివృద్ధి చేయబడింది.