Andhra University Admissions 2024 :ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కోర్సుల్లో ఈఈటీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కోర్సుల్లో సెల్ఫ్‌సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏయూ ఈఈటీ 2024 ప్రవేశాల కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. రక్షణ రంగ ఉద్యోగులు, దివ్యాంగుల విభాగాల వారికి ఈ నెల 17న ప్రత్యక్షంగా సర్టిఫికెట్ల పరిశీలన జరుపుతారు. ఎన్‌సీసీ, క్రీడా విభాగాల వారు తమ సర్టిఫికెట్లను ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు అప్‌లోడ్ చేయాలని, ఇతర విభాగాల విద్యార్థులు ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు తమ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఎ.నాయుడు సూచించారు. ఈనెల 25 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తొలిదశ సీట్ల కేటాయింపు జూన్ 1వ తేదీన నిర్వహిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Also Read : UPSC IFS 2023 Topper Ritvika Pandey