Collector Appreciation: పోటీల్లో గెలిచిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు
Sakshi Education
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఓటు హక్కు ప్రాధాన్యతపై నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ కలెక్టర్ తమ అభినందనలు తెలిపారు.
సాక్షి ఎడ్యుకేషన్: ‘ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యత’పై నిర్వహించిన పోటీల్లో భైంసాకు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో ‘సిస్టమేటిక్ వోటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్ పోగ్రాం’లో భాగంగా జరిగిన కార్యక్రమంలో కళాశాలకు చెందిన సెకండియర్ విద్యార్థిని అదిబా నాజ్ ఓటు హక్కు ప్రాధాన్యతపై ఉర్దూలో గేయం రచించి పాడింది.
Free training: సాఫ్ట్‌వేర్ డవలపర్ కోర్సులో ఉచిత శిక్షణ
ఈ మేరకు కలెక్టర్ వరుణ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రంతో పాటు రూ.3వేల నగదు పురస్కారం అందుకుంది. అలాగే మరో 10మంది విద్యార్థినులు కూడా వివిధ పోటీల్లో ప్రతిభ కనబరచగా వారికీ కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ జుఫిషాన్ సుల్తానా, అధ్యాపకులు అభినందించారు.
Published date : 25 Sep 2023 11:11AM