Free training: సాఫ్ట్‌వేర్ డవలపర్ కోర్సులో ఉచిత శిక్షణ
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో తమ కళాశాల ఆవరణలో జూనియర్ సాఫ్ట్‌వేర్ డవలపర్ కోర్సులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ శిక్షణ పొందటానికి అర్హులని పేర్కొన్నారు.
ఈ కోర్సులో భాగంగా నూతన సాంకేతికత పరిజ్ఞానంలో శిక్షణ ఇస్తామని తెలియజేశారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి సర్టిఫికెట్‌తో పాటుగా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చూపిస్తామని వివరించారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోగా విద్యార్హతల మార్కుల జాబితా, ఆధార్ కార్డు, ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రమేష్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాలకు 93477 79032 నంబర్‌లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.