Student Stipend 2023 : ఈ విద్యార్థులకు.. గుడ్‌న్యూస్.. నెలకు రూ. 83 వేలు స్టైఫండ్.. ఈ అర్హతలుంటే చాలు..
ప్రస్తుతం ఎక్కువ శాలరీలు ఇస్తున్న కంపెనీలలో ప్రముఖ టెక్ దిగ్గజం 'గూగుల్' ఒకటని అందరికి తెలుసు. ఈ సంస్థలో ఉద్యోగం కోసం చాలామంది విశ్వప్రయత్నం చేస్తారు. అందులో అందరికి జాబ్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సంస్థ 'వింటర్ ఇంటర్న్‌షిప్-2024' పేరుతో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? స్టైఫండ్ ఎంత ఇస్తారు..?
మొదలైన పూర్తి వివరాలు కింది చూడొచ్చు.
అర్హతలు ఇవే..
గూగుల్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులై ఉండాలి. టెక్ దిగ్గజంతో మీ కెరీర్‌ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే, ఫ్రెషర్‌లకు ఈ ఇంటర్న్‌షిప్ సువర్ణావకాశం అనే చెప్పాలి.
దరఖాస్తు విధానం ఇలా..?
దరఖాస్తు చేయడానికి ముందు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అందులో తప్పకుండా కోడింగ్ ల్యాంగ్వేజ్ మీద మీకు నైపుణ్యం ఉన్నట్లు నిర్దారించాలి. https://cse.noticebard.com/internships/google-winter-internship-2024/ఈ లింకులోకి వెళ్లి రెజ్యూమ్ సెక్షన్‌లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాలి.
హయ్యర్ స్టడీస్ విభాగంలో అవసరమైన విషయాలు ఫిల్ చేయాలి. ఆ తరువాత డిగ్రీ స్టేటస్ కింద 'నౌ అటెండింగ్' ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత ఇంగ్లీష్ ట్రాన్‌స్క్రిప్ట్‌ను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.
దరఖాస్తు చివరి తేదీ : 2023 అక్టోబర్ 01.
ఎంపికైతే..
ఇందులో ఎంపికైన వారు హైదరాబాద్, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారు ఇంటర్న్‌షిప్ సమయంలో గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో గూగుల్ టెక్నాలజీ సవాళ్ళను ఎదుర్కొంటూ సేవలందించాల్సి ఉంటుంది. సెర్చ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్, నెట్‌వర్కింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, వీడియో ఇండెక్సింగ్‌ను ఆటోమేట్ చేయడం వంటివి ఉండవచ్చు. మొత్తం మీద సంక్లిష్టమైన సాంకేతిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను రూపొందించడమే మీ పని.
వీటిలో ప్రావీణ్యం ఉంటే..
ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లేదా సంబంధిత సాంకేతిక రంగంపై దృష్టి సారించే అసోసియేట్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అనుభవం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో కోడింగ్ ప్రావీణ్యం (Ex: C, C++, Java, JavaScript, Python).
స్టైఫండ్ ఇలా..
ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వ్యక్తి ఆరు నెలలు లేదా 22 నుంచి 24 నెలలు హైదరాబాద్ లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్‌గా నెలకు రూ.83,947 కంపెనీ అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ 2024 జనవరి నుంచి ప్రారంభమవుతుంది.
Tags
- google winter internship 2024 application
- google winter internship details in telugu
- Google offers lucrative Rs 80
- 000 internship
- Google Winter Internship 2024 Application Last Date
- Google Winter Internship 2024 Online Apply
- Google Winter Internship 2024 Amount
- Google Winter Internship apply by Oct 1