Skip to main content

Jobs: వెబ్‌సైట్‌లో ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌

Provisional Merit List on website

కర్నూలు(హాస్పిటల్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, జనరల్‌ హాస్పిటల్స్‌, గవర్నమెంట్‌ నర్సింగ్‌ కాలేజీలకు సంబంధించిన 30 కేటగిరీల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నవంబర్‌ 20న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న 26 కేటగిరీల అభ్యర్థుల ప్రొవిజనల్‌ మెరిట్‌లిస్ట్‌ను విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. సుధాకర్‌ ఫిబ్ర‌వ‌రి 14న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: Work Shop: మోహన్‌బాబు యూనివర్సిటీలో పారామెడికల్‌ విద్యార్థులకు వర్క్‌షాప్‌

జాబితాను వెబ్‌సైట్‌లు https://kurnool.ap.gov.in,https://nandyal.ap.gov.in,https://kurnoolmedic...లో అప్‌లోడ్‌ చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు వివరాలను సరిచూసుకుని అభ్యంతరాలు ఫిబ్ర‌వ‌రి 14న‌ 15 నుంచి 17వ తేదీ సాయంత్రంలోపు కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ కార్యాల యంలో లిఖిత పూర్వకంగా అందజేయాలన్నారు.

Published date : 15 Feb 2024 12:29PM

Photo Stories