కొత్తగూడెంరూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 13 మంది రెగ్యులర్ ఉద్యోగులకు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మణ్ మెమోలు జారీ చేసినట్లు తెలిసింది.
మెడికల్ కళాశాలలో 13 మందికి మెమో?
అక్టోబర్ 5న మెడికల్ కళాశాలలో డీఎంఎల్‌టీ పరీక్షలు నిర్వహించారు. వీటి నిర్వహణలో ఇన్విజిలేటర్లుగా నాలుగో తరగతి ఉద్యోగులను కేటాయించారు. ఈ విషయమై రెగ్యులర్ ఉద్యోగులు ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విషయం పత్రికల్లో వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఇది బయటకు ఎలా వచ్చిందంటూ 13 మందికి మెమో ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్, ఇద్దరు అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్లు, ఆఫీస్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితరులు ఉన్నట్లు సమాచారం.