Skip to main content

క్రీడల్లో రాణించిన వైద్య విద్యార్థులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం 23వ అంతర్‌ కళాశాలల మహిళా క్రీడా పోటీలు అక్టోబ‌ర్ 13 నుంచి 15వ తేదీ వరకూ రాజమండ్రిలోని జి.ఎస్‌.ఎల్‌.మెడికల్‌ కళాశాలలో జరిగాయి.
Medical students excelling in sports
క్రీడల్లో రాణించిన వైద్య విద్యార్థులు

చెస్‌, బాస్కెట్‌ బాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థులు రజత పతకాలు సాధించారు. వారిని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కంచర్ల సుధాకర్‌ అక్టోబ‌ర్ 18న‌ కళాశాలలో అభినందించారు. చెస్‌లో హౌస్‌ సర్జన్లు వి.మధుప్రియ (కెప్టెన్‌), ఎం.కైవల్య, వి.సౌమిక, బాల్‌బ్యా డ్మింటన్‌ టీమ్‌లో ఎ.ప్రవళ్లిక (కెప్టెన్‌), ఎం.కైవల్య జి.గౌరిశ్రీ, ఎం.శివ జ్యోత్స్న, జి.నీలోత్పల, పి.వి.స్నిగ్ధ, కె.సుగమ్య, బాస్కె ట్‌బాల్‌ టీమ్‌లో సీహెచ్‌.మోహనశ్రీ, ఎం. కైవల్య, వై.నేహ, జి.కీర్తి, వై.విదార్థి, ఎం.గ్లాడీ, కె.తేజశ్వి, వై.నవ్య, రుప్షిత సురేష్‌ సత్తాచాటారు.

వైస్‌ ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ ఆర్‌.నాగేశ్వరరావు, డాక్టర్‌ కె.ఇందిరాదేవి, కళాశాల ప్రిజికల్‌ డైరెక్టర్‌ జె.రాములు తదితరులు పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

చదవండి: 

Rural Students: బాల్‌బ్యాడ్మింటన్‌లో విద్యార్థుల హవా

Sakshi: గిరిజన విద్యార్థినికి బంగారు పతకం

Published date : 19 Oct 2023 03:18PM

Photo Stories