Pocharam Srinivas Reddy: నర్సింగ్ కోర్సుతో మెరుగైన ఉపాధి అవకాశాలు
Sakshi Education
బాన్సువాడ రూరల్: నర్సింగ్ కోర్సుకు చక్కటి ఉపా ధి అవకాశాలున్నాయని, విద్యార్థినులు చక్కగా చదువుకుని తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూ చించారు.
డిసెంబర్ 13న ఆయన మండలంలో రూ.40 కోట్ల నిధులతో చేపడుతున్న బీఎస్సీ నర్సింగ్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో విద్యార్థులతో సమావేశమై మాట్లాడారు.
చదవండి: Free training for nurses: నర్సులకు ఉచిత శిక్షణ
నర్సింగ్ కళాశాల బాన్సువాడకు మంజూరు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. వసతులను సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకు రావాలన్నారు. ఆర్డీవో భుజంగ్‌రావు, దుర్కి సర్పంచ్ శ్యామల, నాయకులు అంజిరెడ్డి, క్రిష్ణారెడ్డి, ఎజాస్, లింగమేశ్వర్, వెంకటరమణ, పీఏ భగవాన్‌రెడ్డి ఉన్నారు.
Published date : 14 Dec 2023 03:05PM