Stock Exchange Group: బ్యాంకింగ్, బీమాలో ఏటా వేయి మందికి ఉపాధి
హైదరాబాద్‌లో ఏటా వేయి మందికి ఉపాధి కల్పించేలా లండన్ స్టాక్ ఎక్స్చెంజ్ గ్రూప్ (ఎల్‌ఎస్‌ఈజీ) ‘టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. లండన్ ఎల్‌ఎస్‌ఈజీ గ్రూప్ సీఐఓ ఆంటోనీ మెక్ కేథీ, కేటీఆర్ మధ్య జరిగిన భేటీ ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో ఎల్‌ఎస్‌ఈజీ ‘టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు ద్వారా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగానికి ఊతం లభించనుంది. తద్వారా ఆయా రంగాల వృద్ధితోపాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.
చదవండి: KTR: అన్ని భాషల్లోనూ ఈ పరీక్ష రాసే అవకాశమివ్వాలి
అంతర్జా తీయంగా 70కి పైగా దేశాల్లో డేటా ఫైనాన్షియల్ మార్కెట్‌లో మౌలిక వసతుల కల్పన చేస్తున్న ఎల్‌ఎస్‌ఈజీ.. 190 దేశాల్లో ఆర్థిక సేవలను అందిస్తోంది. మే 12న ఎల్‌ఎస్‌ఈజీతో కుదిరిన అవగాహన ఒప్పందంపై ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఎల్‌ఎస్‌ఈజీ సీఐఓ మెక్ కేథీ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ కొణతం దిలీప్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.