Skip to main content

విదేశాల్లో నర్సింగ్, పారామెడికల్‌ కొలువులు

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల్లో నర్సింగ్, పారా మెడికల్‌ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) తెలిపింది.
Nursing and Paramedical Jobs Abroad
విదేశాల్లో నర్సింగ్, పారామెడికల్‌ కొలువులు

టామ్‌కామ్‌ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన విభాగానికి అనుబంధంగా పనిచేస్తోంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో భాగంగా జనవరి 11వ తేదీన హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజీలో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

చదవండి: Telangana Job notification: 5204 స్టాఫ్‌ నర్సు పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆరోజున వర్క్‌షాప్‌కు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని, ఉద్యోగావకాశాలు తదితర పూర్తి సమాచారం అక్కడే అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. వివరాలకు 9100798204, 9908830438 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించింది. 

చదవండి: Nursing Officer Jobs: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో 256 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Published date : 10 Jan 2023 01:36PM

Photo Stories