Mega job Mela: అర్హత ఉంటే ఉద్యోగం.. జాబ్ మేళా తేదీలు ఇవే..
అర్హత ఉంటే చాటు ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్ తదితర రంగాల్లో సుమారు 7వేల ఉద్యోగాలను ఒకే వేదికపై కల్పించనున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఆడారి ఆనంద్‌కుమార్ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మెగా జాబ్ ఫేర్‌ను పురస్కరించుకుని 59వ వార్డు జింక్ ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా గల అండాలమ్మ కళాశాల వద్ద గురువారం ఆడారి ఆనంధ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
చదవండి: Job Trends: స్కిల్ ఉంటేనే.. కొలువు!
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించామన్నారు.
నియోజకవర్గంలో ఎక్కువ పరిశ్రమలున్నాయని, అయితే స్థానికులకు అక్కడ ఉపాధి లభించడం లేదన్న విషయాన్ని నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఈ విషయంపై నాలుగు నెలల నుంచి పార్టీ రాష్ట్ర సలహాదారుడు మిలీనిమం శ్రీధర్‌రెడ్డితో చర్చించి ఇక్కడ పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించేలా మెగా జాబ్‌మేళాకు శ్రీకారం చుట్టామన్నారు.
గోపాలపట్నంలోగానీ పారిశ్రామికవాడలో మరోమారు జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. మిలీనియం శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇదో గొప్ప అవకాశమని, ఈ మెగా జాబ్‌మేళాలో 70 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. సుమారు 5 నుంచి 7 వేల మందికి ఉపాధి లభించడం ఖాయమన్నారు.
వివరాలకు 9000818467 , 9000938467 నంబర్లలో సంప్రదించాలన్నారు. 59వ వార్డు జింక్ ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా గల అండాలమ్మ కళాశాల్లో శుక్ర,శనివారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కలిదిండి బద్రినాథ్, కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహ్మాన్, పారిశ్రామిక ప్రాంత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పుర్రె సురేష్ యాదవ్, పలు వార్డుల కార్పొరేటర్లు పీవీ సురేష్, గుండపు నాగేశ్వరరావు, బల్లా లక్ష్మణరావు పాల్గొన్నారు.