Skip to main content

Mega Job Mela: ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్‌మేళా

మహబూబాబాద్‌: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్‌మేళాను న్విహించామని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు.
Mega Job Mela,Job fair initiative in Mahabubabad,MLA Banoth Shankarnaik addressing Mega Job Mela
ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్‌మేళా

సూర్యచంద్ర చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అక్టోబ‌ర్ 9న‌ మెగాజాబ్‌ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. 70 కంపెనీలతో 2,500మందికి ఉపాధిఅవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతీ నిరుద్యోగి నిరాశ చెందకుండా ముందుగా ఏదైనా ఉద్యోగంలో చేరిన తర్వాత దానికంటే మెరుగైన జాబ్‌ సంపాదించాలన్నారు.

చదవండి: SSC JE 2023 Notification: కేంద్రంలో 1324 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు.. విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

జాబ్‌మేళాకు నిరుద్యోగులు అధికసంఖ్యలో హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఫరీద్‌, ఎమ్మెల్యే సతీమణి సీతామహాలక్ష్మి, కుమార్తె తేజస్వి, కుమారుడు సూర్య, నాయకులు మురళీధర్‌రెడ్డి, రాజశేఖర్‌, రంజిత్‌ తదితరులు ఉన్నారు.

Published date : 10 Oct 2023 03:18PM

Photo Stories