Skip to main content

Job Mela: 15న జాబ్‌మేళా

సాక్షి,పాడేరు: పాడేరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డిసెంబ‌ర్ 15న నిర్వహించే జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కోరారు.
job fair  Government Junior College Paderu hosts job fair

జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాకు సంబంధించిన పోస్టర్‌నునామె డిసెంబ‌ర్ 12న‌తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా నిర్వహిస్తున్నారన్నారు. టెన్త్‌, ఐటీఐ, డిప్లమో, బీటెక్‌, పీజీ, పీహెచ్‌డీ చదివిన అభ్యర్థులంతా జాబ్‌మేళాకు ధ్రువపత్రాలతో హాజరు కావాలని ఆమె కోరారు.

చదవండి: 1,207 Jobs in SSC: ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి,డి ఎగ్జామినేషన్‌–2023 వివరాలు.. రాత పరీక్ష.. 200 మార్కులు

జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్‌, పాడేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కూతంగి సూరిబాబు, జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షురాలు సరస్వతి, సభ్యుడు మినుముల కన్నాపాత్రుడు, కుజ్జెలి సర్పంచ్‌ గబ్బాడ చిట్టిబాబు, పాస్టర్‌ మోద బాబూరావు, పెదబయలు మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధి పిట్టా నవీన్‌ పాల్గొన్నారు. Sakshi Education Whatsapp Channel Follow

Published date : 13 Dec 2023 02:39PM

Photo Stories