General Motors: 1,245 ఉద్యోగాల తొలగింపును రద్దు చేసిన ప్రఖ్యాత సంస్థ
ప్రధానంగా ఉద్యోగుల జీతభత్యాలు కంపెనీలకు భారంగా మారుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా జనరల్ మోటార్స్ సంస్థ 1245 ఉద్యోగాల తొలగింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
బ్రెజిల్ దేశంలోని సావో పాలో రాష్ట్రంలో ఉన్న సావో జోస్ డోస్ క్యాంపస్, సావో కేటానో డో సుల్, మోగి దాస్ క్రూజెస్‌లోని ఫ్యాక్టరీల్లో జనరల్ మోటార్స్ 1,245 ఉద్యోగుల తొలగింపును రద్దు చేయనున్నట్లు అక్కడి కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ ఇటీవల తెలిపింది.
చదవండి: Jobs in MNC Company: MNC కంపెనీలో ఉద్యోగాలు
ముందుగా కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అందుకు విరుద్ధంగా కార్మికులు బ్రెజిలియన్ లేబర్ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఉద్యోగుల తొలగింపును కొనసాగించడానికి అనుమతి కోసం సంస్థ సైతం కోర్టుకెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విచారించిన కోర్టు..కంపెనీ అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో మరుసటి రోజు జనరల్‌మోటార్స్ ఈ ప్రకటన చేసింది.
జనరల్ మోటార్స్ అమెరికాకు చెందిన వాహన తయారీ సంస్థ. కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని మిచిగాన్‌లో ఉంది. జనరల్ మోటార్స్ చెవ్రొలెట్, జీఎంసీ, కాడిలాక్, బ్యూక్ తో సహా పలు ప్రసిద్ధ ఆటోమొబైల్ బ్రాండ్‌లను తయారుచేస్తుంది. 2022 నాటికి జనరల్ మోటార్స్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,67,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2016లో కంపెనీ ఉద్యోగులు 2,25,000 మంది ఉండేవారు.