Jobs: విదేశాల్లో ఉద్యోగావకాశాలకు ‘ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగావకాశాలకు సంబంధించి ప్రతి శనివారం మల్లేపల్లిలోని టామ్‌కామ్ కార్యాలయంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు టామ్‌కామ్ సీఈఓ మే 4న ఒక ప్రకటనలో తెలిపారు.
గల్ఫ్ దేశాలతోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగరీ, యూకే తదితర దేశాల్లో నైపుణ్య ఉద్యోగాలు, సాంకేతిక సహాయకులకు సంబంధించిన కేటగిరీల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వివరాలు నమోదు చేసుకోవాలని, లేదా టామ్‌కామ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాలని సూచించారు.
చదవండి:
Published date : 05 May 2023 01:23PM