Skip to main content

Foreign Jobs: విదేశీ ఉద్యోగాలకు నేడు ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌

కాళోజీ సెంటర్‌: ఇజ్రాయిల్‌ (నిర్మాణరంగ కార్మికులు), జర్మనీ (నర్సులు)లో ఉద్యోగాల కోసం వరంగల్‌ ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మార్చి 7న‌ ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్‌.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు.
 Enrollment Drive for Jobs in Israel and Germany   Enrollment drive for foreign jobs today   Nursing Jobs Opportunity in Germany

తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌), రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ రిజిస్టర్డ్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణరంగ కార్మికులు ఎస్సెస్సీ ఉత్తీర్ణత, వయస్సు 21–45 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలని తెలిపారు.

చదవండి: US Student Visa New Rules: దరఖాస్తులో ఈ కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే... వీసా ఫీ కూడా వెనక్కి రాదు!!

నర్సింగ్‌ ఉద్యోగాలకు 1–3 సంవత్సరాల అనుభవం ఉండి 21–28 వయస్సు గల అభ్యర్థులు కనీసం బీఎస్సీ/జీఎన్‌ఎం హోల్డర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. వివరాలకు www. tomcom.telangana.gov.in లేదా 9985483931, 8247838789, 78935664933 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Published date : 07 Mar 2024 05:46PM

Photo Stories