Citigroup To Cut Jobs- 20వేల మంది ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం
అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం సిటీ బ్యాంక్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. రాబోయే రెండేళ్లలో 20వేల మంది ఉద్యోగులను తొలగించాలని సిటీ గ్రూప్ యోచిస్తోంది. గత 14 ఏళ్లలో అత్యంత దారుణమైన త్రైమాసిక ఫలితాలు రావడంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..
కంపెనీ పునర్వవస్థీకరణలో భాగంగా రాబడులను పెంచేందుకు వాల్ స్ట్రీట్ దిగ్గజం సిటీ గ్రూప్ 2024లో ఉద్యోగాలను తగ్గించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయగా, ఆ సమయంలో సిటీ గ్రూప్ ఈ కాలంలో 1.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఇది అత్యంత నిరాశాజనకమైన ఫలితాలని పేర్కొంది.
గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే బ్యాంక్ ఆదాయం 3 శాతం తగ్గి 17.40 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తొలగింపుల వల్ల బ్యాంకుకు 2.5 బిలియన్ల డాలర్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేన్ ఫ్రెషన్ మాట్లాడుతూ.. ''గతేడాది అనుకున్నంత ఆశించినంతగా లేదు, 2024 మాకు చాలా ముఖ్యమైనది.
భారీగా మార్పులు.. 2023లో జరిగిందిదే..
బ్యాంక్ రాబోయే రెండేళ్లలో పెద్ద ఎత్తున పునర్నిర్మాణం చేయబోతోంది. దీని ద్వారా మొత్తం 2.5 బిలియన్ డాలర్లను ఆదా చేయడానికి ప్రణాళిక చేయబడింది. ముఖ్యమైన అంశాల ప్రభావం కారణంగా నాల్గవ త్రైమాసికం చాలా నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, సిటీని సరళీకృతం చేయడంలో, 2023లో మా వ్యూహాన్ని అమలు చేయడంలో మేము గణనీయమైన పురోగతి సాధించాము'' అని ఆయన పేర్కొన్నారు.