వైవీయూ డిగ్రీ పరీక్షలు తేదీలు ఇవే..
జిల్లాలోని 79 డిగ్రీ కళాశాలల్లో బిఏ, బీబీఏ, బీసీఏ, బీకాం, బీఎస్సీ, బీఒక్ కోర్సులు చదివే రెగ్యులర్, సప్లమెంటరీ కలిపి 35,562 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. వైవీయూ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్, కుల సచివులు ఆచార్య వైపీ వెంకటసుబ్బయ్య మార్గదర్శకంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
చదవండి: డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి ఉత్తమ న్యాక్ అవార్డు
సెమిస్టర్ల వారీగా మొదటి సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు 7,313 మంది కాగా సప్లమెంటరీ 5324 మంది ఉన్నారన్నారు. మూడో సెమిస్టర్‌కు రెగ్యులర్ 5240 మంది, సప్లమెంటరీకి 6056 మంది ఉన్నారని తెలిపారు. ఐదో సెమిస్టర్‌కు రెగ్యులర్ 9103, సప్లిమెంటరీకి 2522 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. విశ్వ విద్యాలయం అబ్జర్వర్లును ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని వివరించారు.