Skip to main content

APSCHE: డీఎస్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి ఉత్తమ న్యాక్‌ అవార్డు

ఒంగోలు: స్థానిక డీఎస్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి లభించిన ఉత్తమ న్యాక్‌ అవార్డును కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.కళ్యాణి అందుకున్నారు.
Best NAC Award for DS Govt Women's Degree College  College Principal Dr. D. Kalyani receiving Best NAC Award at State Anniversary

 ఏపీ ఉన్నతవిద్య ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ కాలేజీలో డిసెంబ‌ర్ 16న‌ జరిగిన రాష్ట్రస్థాయి వార్షికోత్సవంలో ఈ అవార్డును ఉన్నత విద్య కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌ చేతుల మీదుగా అందుకున్నారు. ఉత్తమ ఐక్యుఏసీ కో ఆర్డినేటర్‌ పి.కుసుమకుమారికి ప్రత్యేక అవార్డు లభించింది.

చదవండి: Pariksha Pe Charcha 2024: పరీక్షల జ్వరానికి ‘చర్చా’ మాత్ర!

మెరిట్‌ విద్యార్థులైన టి.రూపాసాయి బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో, గుర్రం రమ్య బీఎస్‌సి ఎంపీపీఎస్‌లో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో, కుమారి తస్లీమ్‌ ఆక్వా కల్చర్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచారని కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.కళ్యాణి పేర్కొన్నారు.

Published date : 19 Dec 2023 09:38AM

Photo Stories