High Court: ఆ కోర్సుల్లో క్రీడా కోటా ఎందుకు తొలగించారు
ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది. వైద్య, విద్యా కోర్సుల్లో క్రీడా కోటా కింద 0.3 శాతం రిజర్వేషన్‌ను తీసివేస్తూ ప్రభుత్వం..జూలై 4న జీవో 75ను జారీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన జి.హరికృష్ణతో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం ఆగస్టు 10న విచారణ చేపట్టింది.
చదవండి: TS High Court Order : వీఆర్‌ఏల సర్ధుబాటుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. జీవో సస్పెండ్.. కారణం ఇదే..
క్రీడా కోటా రిజర్వేషన్ కింద 2018లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది జైశ్వాల్ వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్ల కల్పన నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందజేసిందని, ఆ నివేదిక ఇవ్వాలని సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగినా ఇవ్వడం లేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
చదవండి: Office Subordinates: జూనియర్ అసిస్టెంట్‌లుగా ఎలా నియమిస్తారు?