TS High Court Order : వీఆర్‌ఏల సర్ధుబాటుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. జీవో సస్పెండ్.. కారణం ఇదే..
Sakshi Education
వీఆర్‌ఏల సర్దుబాటు ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు వీఆర్‌ఏల సర్దుబాటుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను ఆగస్టు 10వ తేదీన జారీ చేసింది.
ఇక.., వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు జీవోను సస్పెండ్ చేసింది. జీవోలకు ముందు యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే వీఆర్‌ఏల పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం వీఆర్‌ఏ వ్యవస్థనూ రద్దు చేసి.. వీఆర్‌ఏలను వివిధ శాఖల్లో విలీనం చేస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం కొత్తగా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించింది. వీఆర్‌ఏల విలీన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను ఇది వరకే జారీ చేసింది. సర్దుబాటు బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది. వివిధ శాఖల్లో సూపర్ న్యూమెరరీ పోస్టులు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఈ మేరకు ఆగస్టు 4వ తేదీన (శుక్రవారం) రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే.
Published date : 11 Aug 2023 10:09AM