TREI-RB: గురుకులాల్లో చేరేదెందరు?
ఒకట్రెండు కేటగిరీల్లో 500 పోస్టులు మినహా మిగిలిన కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైనవారికి ఆయా సొసైటీలు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీలు గత నెలాఖరులో 8,304 పోస్టులకుగాను ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇవి అందుకున్న నాటినుంచి 60 రోజుల్లో వారికి నిర్దేశించిన చోట విధుల్లో చేరాలనేది నిబంధన. ఈ క్రమంలో కొత్తగా ఉద్యోగం సాధించిన వారంతా సెప్టెంబర్ నెలాఖరు కల్లా తప్పనిసరిగా విధుల్లో చేరాలి. లేకుంటే వారి నియామకం రద్దవుతుందని సొసైటీలు ఉత్తర్వుల్లో స్పష్టం చేశాయి.
చదవండి: గురుకుల అభ్యర్థుల వినూత్న నిరసన
ఖాళీల లెక్క తేలేది వచ్చే నెలలోనే...
గురుకుల కొలువుల్లో రెండు, మూడు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రెండు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా అన్ని కొలువులకు సంబంధించిన పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్నారు.
అయితే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) అధికారుల అంచనా ప్రకారం 1,550 ఉద్యోగాలు మిగిలిపోయే అ వకాశమున్నట్టు అభిప్రాయపడుతున్నారు. అక్టోబ ర్ మొదటివారం నాటికి ఈ లెక్కలు తేలే అవకాశం ఉంది.
ఇలా మిగిలిపోయిన ఖాళీలను వచ్చే ఏడాది రూపొందించే జాబ్ కేలండర్‌లో చేర్చుతారనే అభిప్రాయం కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో గురుకుల విద్యాసంస్థల్లో ఉ ద్యోగాల భర్తీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. ఖాళీల ఆధారంగా వచ్చే జాబ్ కేలండర్‌లో ప్రకటన ఇవ్వొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి.