AUలో వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ కార్నర్
ఏయూ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.సమత, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రో చాన్సలర్ జెన్నిఫర్ హోవెల్ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్య కె.సమత మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది, ప్రయోగశాలలు, గ్రంథాలయం వంటి వసతులను కలిగి ఉందన్నారు.
ఏయూలో 58 దేశాలకు చెందిన 1,084 మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. వీరికి అవసరమైన హాస్టళ్లు, వసతులను కల్పించామన్నారు. సుందర నగరం విశాఖ పర్యాటకులకు స్వర్గధామంగా ఉందన్నారు. జెన్నిఫర్ హోవెల్ మాట్లాడుతూ విభిన్న రంగాల్లో ఏయూతో కలిసి పనిచేస్తామన్నారు. రెండు వర్సిటీలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
చదవండి: Govt Dental Students: కలలు కన్నారు.. సాకారం చేసుకున్నారు
ఓఎస్డీ ఆచార్య వి.కృష్ణమోహన్.. ఏయూలో నిర్వహిస్తున్న కోర్సులు, వసతులు, విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు తదితర అంశాలను వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ ఏయూలో సమర్ధంగా నిర్వహిస్తున్న అమెరికన్ కార్నర్ పనితీరు, నిర్వహించిన కార్యక్రమాలపై మాట్లాడారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి వర్చువల్ విధానంలో పాల్గొని రెండు వర్సిటీల ప్రతినిధులను అభినందించారు. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడ్ కమీషనర్(ఇండియా–గల్ఫ్) నషీద్ చౌదరి, ఎడ్యుకేషన్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ ఆంటోని జోసెఫ్, ఏయూ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎస్.కె భట్టి, వి.విజయలక్ష్మి వై.రాజేంద్రప్రసాద్, ఏ.నరసింహారావు, జి.శశిభూషణరావు, ఆచార్య టి.శోభశ్రీ, గ్రంథాలయాధికారి ఆచార్య పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.