KNRUHS: పీజీ వైద్య, దంత విద్య సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: యాజమాన్య కోటా పీజీ వైద్య, దంత విద్య సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు Kaloji Narayana Rao University of Health Sciences (KNRUHS) తెలిపింది.
ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ ప్రవేశాలకు నవంబర్ 25న ప్రకటన విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చునని వివరించింది. ఇప్పటికే మొదటి, రెండు విడతలలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఈ విడత కౌన్సెలింగ్‌కు అనర్హులని స్పష్టం చేసింది.
చదవండి: KNRUHS: నెల రోజులు బ్యాంకు గ్యారంటీ అడగొద్దు
సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారని, నవంబర్ 26న ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in చూడాలని సూచించింది.
చదవండి: MBBS: యథేచ్ఛగా సీట్ల బ్లాకింగ్!
Published date : 26 Nov 2022 01:52PM