Skip to main content

Times Higher Education: రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును సాదించిన విశ్వవిద్యాలయం!

లండన్ కు చెందిన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ 2022వ సంవత్సరానికి సబ్జెక్ట్‌ వారీగా ర్యాంకులు ప్రకటించింది.
Times Higher Education
రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును సాదించిన విశ్వవిద్యాలయం!

వీటిలో ఫిజికల్‌ సైన్సెస్‌ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌ యూ) అంతర్జాతీయ స్థాయిలో 1001+ కేటగిరీలో స్థానాన్ని, జాతీయ స్థాయిలో 37వ, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును పొందింది. వర్సిటీలో విద్య, బోధన, పరిశోధనా పత్రాలు, సైటేషన్స్, ఇన్నోవేషన్స్ తదితర అంశాల ప్రామాణికంగా టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఈ ర్యాంకులను కేటాయించింది. ఇందులో స్థానం సాధించడంపై వీసీ ఆచార్య రాజశేఖర్, రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కరుణ, ఆన్‌ లైన్‌ ర్యాంకుల కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగకిషోర్‌ హర్షం వ్యక్తం చేశారు. 

Published date : 17 Sep 2021 01:46PM

Photo Stories