AICTE: ప్రతిభావంతులకు ప్రతి కాలేజీలో రెండు సీట్లు
కోర్సు పూర్తయ్యే వరకూ ప్రభుత్వమే ఖర్చంతా భరిస్తుంది. అయితే ప్రతి కాలేజీకి ఇలాంటి సీట్లు రెండు (సూపర్ న్యూమరీ) మాత్రమే ఉంటాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈమేరకు సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు ఈ ఆదేశాలను అమలు చేయాలని ప్రకటించింది. ఇందుకు ఇంటరీ్మడియెట్, తత్సమాన కోర్సులు చదివే సమయంలో విద్యార్థి ఏదైనా ఆవిష్కరణలు చేసి ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు అందుకొని, లేదంటే విద్యారి్థకి సంబంధించిన రీసెర్చ్ ఏదైనా పబ్లిష్ అయి ఉంటే ఈ పథకానికి అర్హులు. వచ్చిన దరఖాస్తులను ఎంపిక చేసేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఏఐసీటీఈ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశానికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ సీట్లను పొందేందుకు ఇంటర్‌లో కనీస మార్కులు (35 శాతం) పొంది ఉంటే చాలని పేర్కొంది.
చదవండి:
AICET: కాలేజీ ఏదైనా ఒక సబ్జెక్టుకు ఓకే
AICTE: ఇంజనీరింగ్‌లో చేరాలంటే ఆ సబ్జెక్టులు చదివి ఉండాల్సిందే
AICTE Scholarship: ఈ పథకానికి ఎంపికైన ప్రతి విద్యార్థినికి ఏడాదికి రూ.50వేలు...