NITM: ‘నిథమ్’కు ప్రతిష్టాత్మక ‘ఐఎస్‌ఓ సర్టిఫికేషన్స్’
రాయదుర్గం: రాష్ట్రంలో అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య ఉన్నత విద్యా, శిక్షణ సంస్థగా గుర్తింపు సాధించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్) ఐఎస్‌ఓ çసరి్టఫికేషన్‌లను సాధించింది. ఐఎస్‌ఓ 9001–2015 క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ ఇన్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్. ఐఎస్‌ఓ 50001–2011 ఇంధన ఆదా పద్ధతుల అమలు కోసం ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, పచ్చదనం, పర్యావరణంపై అవగాహన కార్యక్రమాల అమలు కోసం ఐఎస్‌ఓ 14001–2015 ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను నిథమ్ సాధించింది. మంగళవారం ఐఎస్‌ఓ సరి్టఫికేషన్స్‌ను సీఎస్ సోమేశ్‌కుమార్ నుంచి నిథమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.చిన్నంరెడ్డి అందుకున్నారు.
గూగుల్ షాకింగ్ నిర్ణయం..: ఈ రూల్స్ పాటింకపోతే ఇంటికే..!
పర్యాటక విశ్వవిద్యాలయంగా నిథమ్
నిథమ్‌ను భవిష్యత్తులో పర్యాటక విశ్వవిద్యాలయంగా మార్చేందుకు ఐఎస్‌ఓ సరి్టఫికేషన్స్ ఎంతో దోహదం చేస్తాయని నిథమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.చిన్నంరెడ్డి పేర్కొన్నారు. ఈ సర్టిఫికేషన్స్ ద్వారా న్యాక్ అక్రిడిటేషన్ పొందడానికీ అవకాశం కలుగుతుందన్నారు.
Click here for more Education News