Skip to main content

విద్యార్థులపై పైసా భారం లేదు

రాష్ట్రంలో ప్రయివేటు అన్ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మాదిరిగానే ఎయిడెడ్‌ కాలేజీల్లోని అన్ ఎయిడెడ్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు అమలు చేస్తోంది.
విద్యార్థులపై పైసా భారం లేదు
విద్యార్థులపై పైసా భారం లేదు

ఏ ఒక్క విద్యార్థి మీద పైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా వాటిని భరిస్తోంది. విద్యావ్యవస్థలో గ్రాంట్‌ ఇన్ ఎయిడ్‌ విధానం 1960లో ఆరంభమైంది. అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ డిగ్రీ కాలేజీలకు, సీట్లకు డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. దీనికి అనుగుణంగా కాలేజీలు, సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో ప్రభుత్వం ప్రయివేటు డిగ్రీ కాలేజీల ప్రారంభానికి అనుమతులు ఇచ్చింది. ఈ తరుణంలో కొంతమంది దాతలు, ప్రముఖులు మంచి ఉద్దేశంతో సమాజానికి సేవచేయాలని కాలేజీలు స్థాపించారు. భీమరంలోని డీఎన్ ఆర్‌ కాలేజీ, ఏలూరులోని సీఆర్‌రెడ్డి కాలేజీ, మదనపల్లెలోని బీటీకాలేజీ, అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ కాలేజీ, విశాఖపట్నంలో డాక్టర్‌ ఎల్‌బీ కాలేజీ.. వంటివి ఇలా ఏర్పాటైనవే. వీటిలో విద్యార్థుల చేరికలు పెరుగుతున్న కొద్దీ అదనంగా అధ్యాపకుల అవసరం ఏర్పడింది. సిబ్బంది సంఖ్య పెరిగిన కొద్దీ వారికి వేతనాలు వంటివి అందించడం ఆయా సంస్థలకు ఆర్థికంగా భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా యాజమాన్యాలు ఆర్థికసాయాన్ని అర్థించగా ప్రభుత్వం టీచర్ల వేతనాలకు ఇయర్లీ గ్రాంటును మంజూరు చేసింది. తరువాత దీన్ని 3 నెలలకు మార్చింది. 2010–12 నుంచి ఈ వేతనాల చెల్లింపును సీఎఫ్‌ఎంఎస్‌ పరిధిలోకి చేర్చారు. రాష్ట్రంలో 1,444 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 1,153 ప్రయివేటు అన్ ఎయిడెడ్‌వి. 137 ఎయిడెడ్, 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు. కాలేజీల సంఖ్య పెరిగాక ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో చేరికలు తగ్గిపోయాయి. 2020–21లో మొత్తం కాలేజీల్లోని సీట్లలో 57 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి.

ఫీజులు భరిస్తున్న ప్రభుత్వం

మరోవైపు మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల పునర్వ్యవస్థీకరణ జరిగి మార్కెట్, ఎంప్లాయిమెంటు ఓరియెంటెడ్‌ కోర్సులు ప్రారంభమయ్యాయి. దీంతో సంప్రదాయ కోర్సుల్లో చేరికలు పడిపోయాయి. ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో 90 శాతం కోర్సులు అన్ ఎయిడెడ్‌వి ఉన్నాయి. వీటికి ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఖరారు చేసిన ఫీజులే వర్తిస్తాయి. ఈ కోర్సులకు అయ్యే ఫీజులను.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక పూర్తిగా రీయింబర్స్‌మెంటు చేయిస్తున్నారు. ప్రయివేటు అన్ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మాదిరిగానే ఎయిడెడ్‌ కాలేజీల్లోని అన్ ఎయిడెడ్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు అమలవుతోంది. ఏ ఒక్క విద్యార్థి మీద కూడా నయాపైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఖరారైన ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తున్నట్లు ఉన్నత విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఒకవేళ ఏ కాలేజీలోనైనా నిర్ణీత ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తే ఆ సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ప్రైవేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సులకు 2020–21, 2021–22, 2022–23 విద్యాసంవత్సరాలకు నిర్ణయించిన ఫీజు (రూపాయల్లో)

కోర్సు

కేటగిరి–1

కేటగిరి–2

కేటగిరి–3

బీఏ, బీ వొకేషనల్‌

10,000

9,000

8,000

బీకామ్‌ (జి)

12,500

11,000

10,000

బీకామ్‌ (కంప్యూటర్స్‌)

15,000

13,000

11,500

బీఎస్సీ (రీస్ట్రక్చరల్‌ కోర్సు)

16,000

14,000

12,000

బీబీఏ

18,500

16,000

14,500

బీసీఏ

18,500

16,000

14,500

బీహెచ్‌ఎం

30,000

27,000

24,000

బీఎస్సీ (ఫుడ్‌ టెక్నాలజీ, ఇతర)

30,000

27,000

24,000

ఎయిడెడ్ స్కూళ్లలో తగ్గిన చేరికలు

ఎయిడెడ్ పాఠశాలల్లో కనీస వసతులు, సరైన బోధన లేకపోవడం, యాజమాన్యాలు కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటంతో చేరికలు మరింతగా తగ్గిపోయాయి. ప్రభుత్వం ఇక్కడి సిబ్బంది వేతనాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఖర్చుచేస్తున్న ప్రజాధనం వృధాగా మారుతోంది. విద్యార్థులకు సరైన ప్రమాణాలతో కూడిన విద్య అందడం లేదు.

విద్యార్థుల సంఖ్య ప్రకారం ఆయా పాఠశాలల వివరాలు..

విద్యార్థుల సంఖ్య

ప్రాథమిక పాఠశాలలు

ప్రాథమికోన్నత పాఠశాలలు

ఉన్నత పాఠశాలలు

1–10

28

66

8

11–20

70

132

40

21–30

81

184

42

31–40

412

154

34

41–50

20

131

8

51–60

27

51

27

61–70

32

71

23

71–100

27

107

28

101–200

73

213

30

201–300

15

95

4

301–400

14

42

2

401–500

3

20

501 ఆపైన

3

18

2

చదవండి:

Padma Shri: వన సామ్రాజ్యాని సృష్టించిన తులసీ గౌడ

Padma Awards 2020: పద్మ పురస్కారాల పూర్తి జాబితా

KTR: కోయ బాలిక ఐఐటీ విద్య కోసం..కేటీఆర్‌ సాయం

Published date : 10 Nov 2021 12:08PM

Photo Stories